సారాంశం 

గర్భధారణ సమయంలో పొత్తికడుపులో నొప్పి రావడమనేది మామూలే, అసాధారణమైన విషయమేం కాదు ఇది. అయితే, తమ మొదటి శిశువుకోసం ఎదురుచూస్తున్న తరుణంలో గర్భవతులైన మహిళలకు ఇలా పొత్తికడుపు నొప్పి రావడం అనేది ఓ అవాంతర అనుభవమే మరి.  నిండు మనుషులకు వచ్చే పొత్తికడుపు నొప్పికి కారణాలు అనేకం. మలబద్ధకం, అజీర్ణం, పొట్టలో గుండ్రంగా తిప్పుతున్నట్లు నరం నొప్పి రావడం (round ligament pain), కడుపు బిగదీసి నొప్పి రావడం (Braxton Hicks contractions) అనేవి ఈ కారణాల్లో కొన్ని. గర్భవతుల పొత్తికడుపు నొప్పికి స్థానభ్రంశమైన (ఎక్టోపిక్) గర్భం, గర్భస్రావం, అండాధార అవాంతరం మరియు అకాల పురిటినొప్పులు వంటి మరింత తీవ్రమైన కారణాలు కూడా ఉన్నాయి. ఈ లక్షణాలన్నీ ఎక్కువ అసౌకర్యంతో కూడుకుని ఉండి మరింత తీవ్రమైన లక్షణాలను ఉత్పత్తి చేయగలవు. ఈ పొత్తికడుపులో వచ్చే నొప్పికి కారణాల్ని నిర్ధారణ చేయడమనేది గర్భం ధరించిన మహిళలకు ఓ సవాలుగానే ఉంటుంది. కాబట్టి, నొప్పి వచ్చిన వెంటనే క్షుణ్ణంగా పరీక్ష చేయించుకోవడానికి డాక్టర్ ని సందర్శించండం ఉత్తమమని సిఫార్సు చేయడమైంది. ఏమైనప్పటికీ, నొప్పి స్వల్పకాలం ఉండి తర్వాత రాకుండా పరిష్కారమైపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అల్ట్రాసౌండ్ మరియు MRI స్కాన్లు సాధారణంగా నొప్పి యొక్క ఖచ్చితమైన కారణాన్ని విశ్లేషించడానికి ఉపయోగకరంగా ఉంటాయి. గర్భవతికొచ్చే పొత్తికడుపునొప్పికి చికిత్స అనేది, నొప్పి యొక్క కారణం మీద ఆధారపడి ఉంటుంది. ఇందుకు అనేక స్వీయ రక్షణ చర్యలు ఉన్నాయి, ఇవన్నీ పరిస్థితి నిర్వహణలో సహాయపడతాయి.

  1. గర్భధారణ సమయంలో కడుపు నొప్పి అంటే ఏమిటి - What is abdominal pain during pregnancy in Telugu
  2. గర్భధారణ సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పి లక్షణాలు - Symptoms of abdominal pain during pregnancy in Telugu
  3. గర్భధారణ సమయంలో వచ్చే కడుపు నొప్పికి కారణాలు మరియు ప్రమాద హేతువులు - Causes and risk factors of abdominal pain during pregnancy in Telugu
  4. గర్భధారణ సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పి నివారణ - Prevention of abdominal pain in pregnancy inTelugu
  5. Diagnosis of abdominal pain during pregnancy
  6. గర్భధారణ సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పికి చికిత్స - Treatment of abdominal pain during pregnancy in Telugu
  7. గర్భధారణ సమయంలో పొత్తి కడుపు నొప్పి రోగ నిరూపణ మరియు సమస్యలు - Prognosis and complications of abdominal pain during pregnancy

పొత్తి కడుపులో నొప్పి వస్తోందంటూ సాధారణంగా గర్భవతులు వైద్యుల వద్దకు వెళ్లి చెప్తుంటారు. ఇది కడుపులో పెరుగుతున్న శిశువు మరియు గర్భంతో సంబంధం కలిగిన శరీర మార్పుల కారణంగా ఉదర ప్రాంతములో వచ్చే వచ్చే నొప్పులే. గర్భవతులకు శారీరకంగా వచ్చే మార్పులకు సూచనగానే ఈ పొత్తికడుపు నొప్పులు రావడం సంభవిస్తుంటుంది. మొదటిసారి గర్భం దాల్చిన స్త్రీకి పొత్తికడుపులో వచ్చే ఈ నొప్పితోగూడిన అనుభవాలు ఆందోళన కలిగించేవి కావచ్చు. అందువల్ల, గర్భవతులైనవాళ్లు ఈ లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యము. ఈ లక్షణాలన్నీ గర్భధారణ సమయంలో గర్భవతికి కలిగే తీవ్ర అసౌకర్యాలు. గర్భధారణ సమయంలో కడుపు నొప్పి యొక్క లక్షణాలు కడుపు ప్రాంతంలో ఎక్కడైనా రావచ్చు. కావలల్ని మోస్తున్న గర్భవతికి వచ్చే పొత్తికడుపునొప్పి ఒకింత ఎక్కువగానే ఉంటుంది.

Women Health Supplements
₹719  ₹799  10% OFF
BUY NOW

గర్భధారణ సమయంలో కడుపు నొప్పి కడుపు ప్రాంతంలో ఎక్కడైనా కలగొచ్చు. కడుపు నొప్పితో పాటు వచ్చే వివిధ నొప్పి లక్షణాలు ఇలా ఉంటాయి.

  • యోని రక్తస్రావం
  • ముట్టు కానప్పుడు రక్తస్రావమవడం (స్పాటింగ్)
  • జ్వరం (ఫీవర్)
  • అలసట
  • వికారం
  • వాంతులు
  • రొమ్ము నొప్పి లేదా సున్నితత్వంతో కూడిన రొమ్మునొప్పి  
  • యోని స్రావం (ఉత్సర్గ)

కారణాలు 

గర్భధారణ సమయంలో వచ్చే కడుపు నొప్పికి కారణాలు క్రిందివిధంగా ఉన్నాయి:

  • మలబద్ధకం
    గర్భవతుల్లో మలబద్దకం అనేది ఓ సాధారణ లక్షణం. గర్భధారణ సమయంలో ఈ మలబద్ధకం ప్రొజెస్టెరాన్ అనే పదార్ధం యొక్క అధిక స్థాయిల కారణంగా ఏర్పడుతుంది మరియు ఉదరంలో పెరుగుతున్న శిశువు యొక్క ఒత్తిడి కారణంగా కూడా గర్భధారణ సమయంలో మలబద్దకమేర్పడుతుంది. హార్మోన్ల స్థాయి పెరుగేకొద్దీ జీర్ణక్రియ ప్రక్రియ గర్భవతుల్లో తగ్గిపోతుంది. తత్ఫలితంగా, పొట్టలో  గ్యాస్ మరియు మలబద్ధకం అనేవి తేలికపాటి కడుపు నొప్పికి దారితీస్థాయి.
  • గుండ్రని నరం (రౌండ్ స్నాయువు) నొప్పి (Round ligament pain)
    పిండంతో కూడిన గర్భాశయ వృద్ధి కారణంగా గుండ్రని నరం (రౌండ్ స్నాయువు) నొప్పి సంభవిస్తుంది. గర్భాశయం పెరుగుతూ ఉండగా గర్భం నుంచి పొత్తి కడుపులోకి వెళ్లే రెండు పెద్ద నరాలపై (స్నాయువులపై) ఒత్తిడి పెరుగుతుంది. గర్భం పెరగడం వల్ల, దిగువ బొడ్డు, గజ్జ మరియు తుంటి ప్రాంతాల్లోకి సాగిన ఈ నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి మరియు తీవ్ర అసౌకర్యానికి దారితీస్తుంది. ఈ నొప్పి నిస్తేజంగా ఉంటుంది కానీ విశ్రాంతి సమయంలో తీవ్రతరమవుతుంది. నిండుమనిషి ఒత్తిగిలి, స్థానాలు మారినప్పుడు లేదా ఆకస్మికంగా కదలినపుడు సూదులతో పొడిచినట్లుండే ఒక పదునైన నొప్పి (sharp pain)  ఉంటుంది. సాధారణంగా, ఈ నొప్పి కూర్చుని ఉన్నపుడు లేదా ఓ పక్కన తిరిగి పడుకున్నప్పుడు ఈ నొప్పి ఉండదు, లేదా తక్కువవుతుంది, ఎందుకంటే ఇలా ఒక స్థితిలో ఉన్నపుడు ఈ నరాలు ఒత్తిడికి గురవవు కాబట్టి.
  • సాధన/అభ్యాస సంకోచాలు (practice contractions)  
    అభ్యాస సంకోచాలనే “బ్రాక్స్టన్ హిక్స్ సంకోచాలు” అని కూడా పిలుస్తారు. ఈ రకమైన నొప్పిలో కడుపులో బిగుతుగా పట్టేసినట్లుగా ఉండే కష్టతరమైన పోటులాంటి నొప్పి గర్భిణులకు కల్గుతుంది. సాధారణంగా మృదువుగా ఉండే పొత్తికడుపు ఈ తరుణంలో గట్టిగా ఉండి ఉన్నట్లుండి నొప్పి తీవ్రంగా అనిపిస్తుంది. ఇలాంటి పొత్తికడుపు నొప్పుల్ని పురిటి నొప్పులుగా భ్రమపడటం కూడా జరుగుతుంటుంది. అందుకే ప్రసవానికి ముందొచ్చే ఈ నొప్పుల్ని “అభ్యాస సంకోచాలు”గా పిలువబడతాయి. అయితే, బ్రాక్స్టన్ హిక్స్ సంకోచాలు పురిటి నొప్పులంత భయంకరంగా ఉండవు. బ్రాక్స్టన్ హిక్స్ సంకోచాలు శరీరంలో నీటిశాతం తక్కువవటం (నిర్జలీకరణం) వల్ల కూడా కలగొచ్చు.
  • ఇతర ఆరోగ్య సమస్యలు
    కొన్నిసార్లు, గర్భధారణ సమయంలో వచ్చే కడుపు నొప్పికి  అసలు గర్భం కారణం కాకపోవచ్చు. అపెండిసైటిస్‌, మూత్రపిండాల్లో రాళ్ళు, అండాశయ తిత్తులు లేదా పిత్తాశయంతో సమస్యలతో సహా ఇతర ఆరోగ్య పరిస్థితులకు సంబంధించినదై ఉంటుంది ఈ గర్భవతి కడుపు నొప్పి .                           

గర్భధారణ సమయంలో వచ్చే కడుపు నొప్పికి గల కొన్ని తీవ్రమైన కారణాలు:

  • అకాల (నెలలు తక్కువ) పురిటినొప్పులు (Premature labour)
    గర్భధారణ సమయం పూర్తికాక ముందే, అంటే 37 వారాల నియమిత గర్భధారణ కాలానికి ముందే, గర్భవతికి పురిటినొప్పులు రావడం. దీన్నే అకాల పురిటినొప్పులని కూడా అంటాం.  ఈ రకమైన పొత్తి కడుపు తిమ్మిరి నొప్పులు గర్భవతికి తీవ్ర నొప్పిని అసౌకర్యాన్ని కల్గిస్తాయి. ఈ నొప్పులొచ్చినపుడు సరైన సమయం లో వైద్య సహాయాన్ని గర్భవతికి అందించి ఆదుకోకపోతే నెలతక్కువ కాన్పుకు దారి తీస్తుంది. అలా జనించిన శిశువు కూడా నెలతక్కువ శిశువు అవుతాడు.
  • అండాధారపు అవరోధం (Placental abruption)
    అండాధారపు అవరోధం (ప్లాసెంటల్ అవరోధం) ఎప్పుడు సంభవిస్తుందంటే గర్భాశయ గోడ నుండి రక్తస్రావం జరుగుతున్నప్పుడు. రక్తస్రావం అయ్యేప్పుడు సాధారణంగా తీవ్రమైన కడుపు నొప్పిని కలిగి ఉంటుంది, ఈ కడుపునొప్పి ఇది గంటలకొలది స్థిరంగా నొప్పిస్తూ ఉంటుంది. ఈ నొప్పికర పరిస్థితికి తక్షణ వైద్యసహాయం కావాలి.
  • మూత్ర మార్గ సంక్రమణం (Urinary tract infection)
    గర్భధారణ సమయంలో మూత్రమార్గంఅంటువ్యాధికి  (యూరినరీ ట్రాక్)లేదా సంక్రమణానికి (UTI ) గురి కావడం చాలా సాధారణం. మూత్రమార్గంలో సంక్రమణం (లేదా UTI) తేలికపాటి నొప్పికి కారణం కావచ్చు. అయినప్పటికీ, ఈ నొప్పి శరీరం ఇతర భాగాలకు వ్యాపించాడు. దిగువ పొత్తికడుపు లేదా వెనుక ప్రాంతం లేదా మూత్రద్వారం (యురేత్రా) సమీపంలో మాత్రం ఉంటుంది. UTI లు కూడా మూత్రవిసర్జన  సమయంలో నొప్పిని కలిగిస్తాయి.
  • గర్భస్రావం (Miscarriage)
    రక్తస్రావంతో కూడిన తీవ్రమైన కడుపునొప్పి రావడం గర్భస్రావానికి ఒక సంకేతం కావచ్చు. వైద్యపరంగా దీన్ని “ఆకస్మిక గర్భస్రావం” అని పిలుస్తారు. గర్భస్రావం సమయంలో కనిపించే ఇతర లక్షణాలు ఏవంటే యోని నుండి రక్తస్రావం ఓ మోస్తరు స్థాయి నుండి విపరీతంగా కూడా ఉండవచ్చు. మరియు యోని నుండి కణజాలం బహిష్కరించబడడడం జరుగుతుంది.
  • పూర్వ-ప్రసూతివాతం Preeclampsia
    గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు రావడాన్ని పూర్వ-ప్రసూతివాతం లేదా ప్రీ-ఎక్లంప్సియా అని పిలుస్తారు. ఈ పూర్వ-ప్రసూతివాతం మరింత తీవ్రమై కుడి వైపున మరియు పక్కటెముకలు కింద నిరంతరమైన నొప్పికి దారితీయవచ్చు. పూర్వ-ప్రసూతివాతం (ప్రీఎక్లంప్సియా) యొక్క ఇతర లక్షణాలేవంటే తలనొప్పి మరియు దృష్టి లోపాలు. ఈ లక్షణాలున్న ప్రసూతివాతానికి తక్షణ వైద్య సహాయం  అవసరం.

ప్రమాద కారకాలు

గుండ్రని నరం నొప్పిని కల్గించే కొన్ని కారణాలున్నాయి, అవేమంటే:

  • దగ్గు
  • తీవ్రమైన పడిశం/విపరీతమైన తుమ్ములు
  • ఉన్నట్లుండి శరీర స్థాన మార్పిడి
  • కూర్చున్న చోటు లేదా పడుకున్న చోటు నుండి ఉన్నట్లుండి లేవడం.

గర్భధారణ సమయంలో మలబద్ధకం ప్రమాదాన్ని పెంచే కారణాలు ఉన్నాయి, వాటిల్లో కొన్ని ఏవంటే:

  • ఒత్తిడి
  • శారీరక శ్రమ లేకపోవడం.
  • ద్రవ పదార్ధాలను మరియు పీచుకల్గిన ఆహారాల్ని తగినంతగా తీసుకోకపోవడం
  • ఇనుముకల్గిన అనుబంధాహారాల సేవనంలో హెచ్చుతగ్గులు (కొన్ని సందర్భాల్లో).

బ్రాక్స్టన్ హిక్స్ సంకోచానికి కొన్ని కారణాలు:

  • పెరిగిన శారీరక శ్రమ.
  • నిర్జలీకరణము.
  • భర్తీ అయిపోయిన మూత్రాశయం.
  • తల్లి పొట్టను చాలా తరచుగా తాకడం.

గర్భస్రావం వంటి గర్భధారణ సమయపు కడుపు నొప్పికి తీవ్రమైన కారణాలకు ప్రమాద కారకాలు:

గర్భధారణ సమయంలో పొత్తి కడుపు నొప్పికి కారణమయ్యే మూత్ర మార్గ సంక్రమణకు దారి తీసే ప్రమాద కారకాలు:

  • మూత్రపిండాల్లో రాళ్లు.
  • మూత్రాశయం మీద శిశువు యొక్క పీడనం కారణంగా మూత్రాశయం ఖాళీ కాకపోవడం
  • చక్కెరవ్యాధి/డయాబెటిస్.

ఎయిడ్స్ లేదా క్యాన్సర్ లేదా రోగనిరోధక శక్తి అణచివేసే మందులు వంటి పరిస్థితుల కారణంగా బలహీనమైన రోగనిరోధకత.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Prajnas Fertility Booster by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors for lakhs of male and female infertility problems with good results.
Fertility Booster
₹892  ₹999  10% OFF
BUY NOW

గర్భధారణ సమయంలో పొత్తి కడుపు నొప్పిని నిరోధించడానికి పలు నిర్దిష్ట చర్యలు తీసుకోవచ్చు:

  • అన్ని వేళలా కావలసినంతగా నీటిని తాగుతుండడం. కాబట్టి గర్భవతులైనవారు రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి. రోజులో కనీసం 2.5 నుండి 3 లీటర్లు నీరు తాగాలి.
  • తగినంత విశ్రాంతి పొందండి.
  • రోజూ తేలికపాటి వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయండి.
  • గర్భవతులు భారీ వస్తువుల్ని ఎత్తడం, దించడం మానుకోవాలి.
  • గర్భవతులు మెట్ల పైకి వేగంగా ఎక్కడం దిగడం మానుకోవాలి.  
  • విశ్రాంతి పొందే ప్రక్రియలో భాగంగా లోతైన శ్వాసను అభ్యాసం  చేయండి.

గర్భధారణ సమయంలో గుండ్రని నరం నొప్పి విషయంలో నిర్దిష్టమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు లేవు. అయితే, మీరు చెప్పే రోగ లక్షణాలు, వివరణను బట్టి మీరు వ్యథ పడుతున్న పొత్తికడుపునొప్పికి వర్తులాకార నరం లేదా గుండ్రని నరం నొప్పి కారణమని డాక్టర్ కు అవగతమవుతుంది. ఖచ్చితమైన రోగ నిర్ధారణలో భౌతిక పరీక్ష అనేది చాలా ముఖ్యమైన మొదటి దశ. రెండో సారి కాన్పుకు సిద్ధమవుతున్న గర్భవతులకు ఈ పొత్తికడుపు నొప్పి చాలా చిరపరిచితంగానే ఉంటుంది.

గర్భిణీ స్త్రీలకు వచ్చే పొత్తి కడుపు నొప్పి యొక్క సాధారణ కారణాలు-అంటే ప్రాణాపాయం కలిగించని కారణాల్ని డాక్టర్ భౌతిక పరీక్షల ద్వారా చాలా సులభంగానే నిర్ధారణ చేస్తారు. అయితే, క్రింది లక్షణాలున్న పక్షంలో, రోగ నిర్ధారణను చేయడానికి రక్త పరీక్షలు మరియు ఇమేజింగ్ పరీక్షలు అవసరమవచ్చు.

  • భారీ రక్తస్రావం.
  • భరించలేని, తీవ్రమైన, మరియు దారుణమైన నొప్పి.
  • చలిపట్టి వచ్చే జ్వరం
  • తీవ్రమైన వాంతులు.
  • తీవ్రమైన వికారం.
  • అసాధారణమైన యోనిస్రావం, ఇది రక్త-రంగు లేదా పసుపు-ఆకుపచ్చ రంగులో ఉంటుంది.
  • మూత్రవిసర్జన సమయంలో నొప్పి లేదా మంట (మరింత సమాచారం: బాధాకరమైన మూత్ర విసర్జన కారణాలు మరియు లక్షణాలు)

ఈ పరీక్షలు కిందివిధంగా ఉంటాయి:

  • అల్ట్రాసౌండ్ మరియు MRI స్కాన్
    ఈ స్కాన్స్ శిశువు యొక్క పెరుగుదలని (పిండం అభివృద్ధిని) అంచనా వేయడానికి మరియు ఏవైనా ఇతర అసహజ పరిణామాలు (సాధారణతలు) ఉంటే వాటిని గుర్తించేందుకు సహాయం చేస్తాయి అల్ట్రాసౌండ్, అలాగే మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ లను గర్భధారణ సమయంలో సురక్షితంగా చేయించుకోవచ్చు. ఈ పరీక్షలు గర్భధారణకు సంబంధం లేని ఏవైనా ఇతర కారణాలను గుర్తించడంలో కూడా ఈ స్కాన్ పరీక్షలు  సహాయపడతాయి. ఈ కారణాలు ఇవి గర్భంతో నేరుగా సంబంధం లేనివే కావచ్చు కానీ కడుపు నొప్పిని కలిగించవచ్చు, ఉదా. పిత్తాశయంలో రాళ్లు (gallstones), ఆంత్రప్రదాహరోగం (appendicitis).
  • రక్త పరీక్షలు Blood tests
    రక్తంలో హార్మోన్ల స్థాయిని గుర్తించడానికి మరియు అంటువ్యాధుల నిర్ధారణకు రక్త పరీక్షలను వైద్యులు నిర్వహించవచ్చు. మూత్ర గర్భ పరీక్ష (urine pregnancy test) కూడా పొత్తి కడుపు నొప్పి యొక్క కారణాన్ని నిర్ణయించడానికి సహాయపడుతుంది. కొన్ని సందర్భాల్లో, హార్మోన్ల స్థాయిని (లేదా అమైలాస్, లైపసీ వంటి ఎంజైమ్ల స్థాయిని) పరీక్ష చేయడానికి 48 గంటలు సమయం పట్టే రక్త పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. క్లోమకం వాపుకు గురైనపుడు (ప్యాంక్రియాటైటిస్) ఈ హార్మోన్లు, లైపసీ వంటి ఎంజైములు బయట పడ్డం జరుగుతుంటుంది.

గర్భధారణ సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పికి చేసే చికిత్స అంతర్లీన కారణాలపై ఆధారపడి ఉంటుంది.

  • మలబద్ధకం మరియు వాయువు (gas) కారణంగా పొత్తికడుపు నొప్పి ప్రేరేపితమైతే, తరచుగా అలాంటి నొప్పి తనకు తానుగా నయమై పోతుంది లేదా కొన్ని ఆహార మార్పులతో పరిష్కరించబడుతుంది. జీవనశైలి (లైఫ్ స్టయిల్) లో మార్పులు చేయడం ద్వారా కూడా మళ్ళీ పొత్తికడుపు నొప్పి రావడాన్ని నిరోధించడంలో సహాయపడతాయి. పీచుపదార్థాలు దండిగా ఉండే ఆహారాల్ని తీసుకోవడం మరియు రోజంతా పుష్కలంగా నీరు తాగడం వల్ల గర్భవతులు మలబద్ధకాన్ని పరిష్కరించుకోవచ్చు.  
  • పొత్తి కడుపునొప్పి తీవ్రమైన సందర్భాల్లో, మలబద్ధకం సమస్యకు చికిత్సగా మృదు విరేచనకారి మందులు లేదా ఇతర మందుల్నిడాక్టర్ గర్భవతులకు సిఫార్సు చేయవచ్చు. ఈ మందులవల్ల విరేచనం సులభమై, ప్రేగుల్లో ఏర్పడే బాధ ఉపశమనం చెందుతుంది. అయితే, ఈ మందులను ముందుగా  వైద్యుడ్ని సంప్రదించి మాత్రమే సేవించాలి, డాక్టర్ సలహా లేకుండా ఈ మందులు సేవించడం తగదు. సాధారణంగా మందుల షాపులో వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా సులభంగా లభించే (ఓవర్ ది కౌంటర్) విరేచనాకారి మందుల్ని (లాక్సిటివ్స్) గర్భవతులు ఖండితంగా తీసుకోకూడదు. డాక్టర్తో సంప్రదించి మాత్రమే ఈ విరేచనాకారి మందుల్ని గర్భవతులు సేవించాలి.
  • పొత్తికడుపులో గుండ్రని నరం (వర్తులాకార నరం) నొప్పికి సంబంధించిన చికిత్స నొప్పిని తగ్గిస్తుంది. ఈ నొప్పి తిరిగి రాకుండా ఉండేందుకు లేదా తగ్గడానికి శరీర భంగిమలో మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది. 
  • పొత్తికడుపు నొప్పి బ్రాక్స్టన్ హిక్స్ సంకోచాల కారణంగా అయితే, దానికి  చికిత్స సాధారణంగా స్వీయ రక్షణయే అయి ఉంటుంది. అయితే, నొప్పి మరింత తీవ్రంగా ఉండి, ఏ పనిని చేయకుండా నిరోధిస్తుంటే, వైద్యుడు గర్భాశయ కండరాలను విశ్రాంతపరచడానికి నొప్పి-ఉపశమన మందులు లేదా మత్తుమందులను సూచించవచ్చు. తీవ్రమైన నిర్జలీకరణం వల్ల బ్రాక్స్టన్ హిక్స్ సంకోచాలు సంభవించినట్లయితే, వైద్యుడు ఒక IV ద్వారా ద్రవాల్ని శరీరంలోకి లెక్కించవచ్చు. IV ద్వారా ద్రవాల్ని శరీరంలోకి ఎక్కించడమంటే డ్రిప్ ద్వారా నేరుగా నరాలకు ద్రవాల్నివ్వడమన్న మాట.  
  • గర్భధారణ సమయంలో పొత్తి కడుపు నొప్పికి దారి తీసే ఇతర తీవ్రమైన కారణాలు లేదా పరిస్థితులకు తక్షణ చికిత్స అవసరం. పొత్తికడుపునొప్పి పరిస్థితి యొక్క తీవ్రతపై చికిత్స ఆధారపడి ఉంటుంది.  
  • స్థానభ్రంశం చెందిన గర్భధారణ స్థితిలో పిండాన్ని శస్త్రచికిత్స చేసి తొలగించడం/తీసివేయడం అవసరమవుతుంది.
  • గర్భస్రావం విషయంలో, స్రావం అయినంత పరిస్థితి మేరకు, పూర్తి శయన విశ్రాంతి (bed rest) తో పాటు హార్మోన్ల థెరపీ లేదా డిలటేషన్ మరియు క్యూర్టిటేజ్తో పద్ధతిలో గర్భాశయాన్ని శుభ్రం చేయాల్సి రావచ్చు. డిలాతతిన్ లేక క్యూరెట్టాజ్ పద్ధతిలో పిండం యొక్క కణజాల అవశేషాలను గర్భాశయం నుండి తొలగించి శుభ్రం చేస్తారు.​

జీవనశైలి నిర్వహణ (Lifestyle management)  

  • గుండ్రని నరం నొప్పి యొక్క నిర్వహణ (Management of round ligament pain) 
    కడుపులో గుండ్రని నరం నొప్పి అనేది డాక్టర్ సిఫార్సు మేరకు ఇంటి వద్దనే ఉండి నిర్వహించుకోగల నొప్పితో కూడిన వ్యాధి. గుండ్రని నరం నొప్పి విషయంలో, డాక్టర్ సాధారణంగా సరైన విశ్రాంతి తీసుకోవాలని సిఫార్సు చేస్తాడు. ఈ వ్యాధి విషయంలో కింద పేర్కొన్నవాటిసాయంతో ఉపశమనం పొందవచ్చు:
    • సాగదీయడంతో కూడిన వ్యాయామాలు stretching exercises
    • గర్భధారణ సమయంలో సిఫార్సు చేయబడిన యోగ సాధన ప్రక్రియలు
    • తాపన మెత్తలు లేదా వెచ్చని స్నానం తీసుకోవడం.
    • శరీర స్థితిని నెమ్మదిగా మరియు క్రమంగా మార్చడం.
    • తామెందుకు ముందు లేదా దగ్గడానికి ముందు వంగడం మరియు తుంటిని వంచుట.
  • మలబద్ధకం కారణంగా వచ్చే కడుపు నొప్పి యొక్క నిర్వహణ Management of abdominal pain due to constipation
    ​ఈ క్రింది చర్యలతో ఈ సమస్యను పరిష్కరించవచ్చు:

    • పీచుపదార్థం పుష్కలంగా ఉన్న ఆహారాన్ని సేవించడం
      ఆహారం పీచుపదార్థాలు దండిగా ఉండే పండ్లు మరియు కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన వనరుల నుండి అయి ఉండాలి. ఊక, వోట్స్, ధాన్యపు రొట్టె (whole grain bread) మరియు కాయలు.

    • ద్రవాహారాల్ని పుష్కలంగా తాగడం
      ద్రవాలైన రసాలను (juices) మరియు నీటిని దండిగా తాగడం. ప్రతిరోజూ కనీసం 10-12 కప్పుల ద్రవ పదార్ధాలను తాగాలి. దీనివల్ల శరీరానికి కావాల్సినంతగా నీరు లభిస్తుంది తద్వారా, ప్రేగుల్లో కదలికలు సులభతరమై జీర్ణక్రియ, విసర్జనలు సులభతరమవుతాయి, మలబద్ధకం నివారించడమవుతుంది.

    • రోజువారీ వ్యాయామం
      వాహ్యాళి (నడక/వాకింగ్), ఈత (స్విమ్మింగ్) లేదా యోగా వంటి వ్యాయామాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి మరియు ప్రేగుల్లో జరిగే విసర్జనాదిక్రియలకు సహాయకారిగా ఉంటాయి. అయితే, వ్యాయామం ఎంత మాత్రం చేయాలో కూడా తెలుసుకోవడం ముఖ్యం. శారీరక శ్రమ చేస్తున్నప్పుడు మీరు విపరీతమైన శ్రమకు గురి కావద్దు మరియు వ్యాయామం చేసే వ్యవధిని 20 నిమిషాలకు పరిమితం చేయండి.

    • ఇనుము కల్గిన అనుబంధకాల్ని తగ్గించడం
      మీరు ఇనుము కల్గిన అనుబంధక మందుల్ని తీసుకున్న తరువాత మీరు  మలబద్ధకం అనుభవించినట్లయితే, ఆరోగ్యకరమైన మరియు సమతుల్య ఆహారం తినడం ద్వారా శరీరం యొక్క ఇనుము అవసరాలను తీర్చేందుకుగాను మీరు తగిన ఆహారాల్ని తీసుకోవాలని మిమ్మల్ని అడగవచ్చు. ఇనుము అనుబంధక మందుల్ని సేవిస్తున్న మీరు వాటి సేవనాన్ని పూర్తిగా ఆపేయడం కానీ తగ్గించడం కానీ చేయడానికి ముందు, అందులోనూ ముఖ్యంగా గర్భధారణ సమయంలో, ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.

  • బ్రాక్స్టన్ హిక్స్ సంకోచాల నిర్వహణ (Management of Braxton Hicks Contractions)
    దీన్ని కొన్ని స్వీయ-రక్షణ చర్యల ద్వారా నిర్వహించుకోవచ్చు:

    • శరీర స్థానం మార్చండి. మీరు నొప్పిని అనుభవించటం ప్రారంభించినప్పుడు నిలబడి ఉంటే, కూర్చొని విశ్రాంతి తీసుకోండి. ఇది నిజమైన కార్మిక సంకోచం అయితే, నొప్పి తగ్గిపోవచ్చు. అయితే, ఒక బ్రాక్స్టన్ హిక్ సంకోచం నెమ్మదిగా తగ్గిపోతుంది.

    • వెచ్చని నీతితో స్నానం చేయడం లేదా తాపన ప్యాడ్లను ఉపయోగించి కూడా నొప్పిని తగ్గించుకోవచ్చు.  

    • నీరు లేదా కొబ్బరి నీటి సేవనంతో శరీరం ఎప్పుడూ నీటికొరత లేకుండా ఉంచుకోవడం.

Ashokarishta
₹359  ₹400  10% OFF
BUY NOW

రోగ నిరూపణ
గర్భధారణ సమయంలో పొత్తి కడుపు నొప్పి ఒక సాధారణ విషయమే. ఈ నొప్పి పరిణామం సాధారణంగా శుభంగానే ముగుస్తుంది. అంటే  చాలా మటుకు పొత్తికడుపునొప్పి యొక్క అధ్యాయాలు తేలికపాటివిగా ఉంటాయి, మరియు వాటంతటవే సహజంగానే తగ్గిపోటాయ్, కాబట్టి ఫలితాలు సాధారణంగా అద్భుతమైనవిగానే ఉంటాయి. పొత్తికడుపునొప్పి తీవ్రమైనదిగా ఉంటే,   సకాలంలో రోగ నిర్ధారణ మరియు సరైన వైద్యసహాయమ చాలా అవసరం.

ఉపద్రవాలు (Complications)

గర్భధారణ సమయంలో చికిత్స చేయని పొత్తికడుపు నొప్పివల్ల కింది సమస్యలకు దారి తీస్తాయి:

  • గర్భస్రావం (మిస్క్యారేజ్)
  • అకాల ప్రసవం (నెలతక్కువ డెలివరీ).
  • పూతిక/సెప్సిస్ (విషసర్పణం) రక్త ప్రసరణకు అంటురోగం దాపురించేట్టుగా ఉన్న పరిస్థితి.
  • ప్రసూతివాతం, గుర్రపువాతం (ఎక్లంప్సియా), గర్భధారణ సమయంలో ప్రసూతివాతానికి ముందు  (ప్రీఎక్లంప్సియా) వచ్చే పరిస్థితిని నియంత్రించకపోతే దాపురించే పరిస్థితినే ప్రసూతివాతం అంటాం. అధిక రక్తపోటును కలిగి ఉంటుంది ఈ పరిస్థితిలో, పాదాల్లో వాపు, మూత్రంలో ప్రోటీన్ల ఉనికి దీని ఇతర లక్షణాలు.
  • బీటలువారిన అపెండిక్స్ (appendix)
  • మూత్రపిండాల అంటురోగాలు.
  • గిలక (హెర్నియా), వ్యాధి ఆరంభంలోనే చికిత్స చేయని సమస్యనే గిలక లేక హెర్నియా అంటారు. వ్యాధికి గురైన కండర కణజాలాలకు రక్తసరఫరా తగ్గిపోతుంది, తద్వారా తీవ్రమైన నొప్పికి దారితీస్తుంది. ఇలాంటి గిలక సమస్యకు వైద్యసహాయం అత్యవసరం.

వనరులు

  1. American Pregnancy Association. [Internet]; Abdominal Pain During Pregnancy.
  2. National Health Service [Internet]. UK; Miscarriage.
  3. National Health Service [Internet]. UK; Stomach pain in pregnancy.
  4. American Pregnancy Association. [Internet]; Pregnancy And Constipation.
  5. American Pregnancy Association. [Internet]; Braxton Hicks Contractions.
  6. Charlie C. Kilpatrick. Abdominal Pain in Early Pregnancy. U.S. Department of Health & Human Services
  7. National Health Service [Internet]. UK; Miscarriage.
Read on app