గర్భ నిర్ధారణ పరీక్ష అనేది ఓ మహిళకు అత్యంత ఆందోళనకరమైన సమయం, ఎందుకంటే ఆమె గర్భవతి కావాలో లేదా వద్దో అన్న మీమాంసపై ఆధారపడి ఉంటుంది. ఈ గర్భనిర్ధారణ హోంటెస్ట్ కిట్ పరీక్షలు ఎంతో సులభంగా మరియు ఎంతో త్వరితంగా అవుతున్నప్పటికీ, ఆ పరీక్షలు అందించే (results) వార్త ఎల్లప్పుడూ ప్రతి మహిళకు జీవితాన్నే మార్చేసే క్షణం. గర్భాశయ పరీక్షా వస్తు సామగ్రి గర్భధారణ హార్మోన్ (మానవ కోరియోనిక్ గోనాడోట్రోపిన్) అని పిలవబడే గర్భధారణ హార్మోన్ను గుర్తిస్తుంది. వివిధ రకాలైన గర్భ నిర్ధారణ పరీక్షలు ఉన్నాయి, ఈ పరీక్షలో ఉన్న ప్రక్రియను బట్టి ఆరోగ్య నిపుణులు ఈ గర్భనిర్ధారణ పరీక్షల్ని ఉపయోగిస్తారు.
గర్భ నిర్ధారణ మూత్ర పరీక్షను నిర్వహించడానికి, ఒక స్ట్రిప్ (strip), క్యాసెట్, లేదా మిడ్ స్ట్రీమ్ (midstream) పరికరం వాడవచ్చు. దీని తరువాత, ఫలితాల యొక్క వివరణ తయారీదారు మార్గదర్శకాల ప్రకారం జరుగుతుంది. గర్భనిర్ధారణా పరీక్షా పరికరాలకు 100% కచ్చితత్వం లేనందున, ఒక ఆరోగ్యసంరక్షణా సౌకర్యాల కేంద్రంలో ఒక రక్తం నమూనాను ఉపయోగించి లేదా అల్ట్రాసౌండ్ను చేయడం ద్వారా గర్భధారణ నిర్ధారణా పరీక్ష (confirmatory pregnancy test) నిర్వహిస్తారు.
గర్భనిర్ధారణ పరీక్షలో ఏమి ఉంటుంది?
మూత్రం లేదా రక్తంలో గర్భధారణ హార్మోన్, hCG (మానవ కోరియోనిక్ గోనాడోట్రోపిన్)ని గుర్తించడం లేదా కనుక్కోవడం గర్భనిర్ధారణ పరీక్షల యొక్క అంతర్లీనసూత్రం. కాబట్టి, "గర్భనిర్ధారణ పరీక్ష" అనే పదాన్ని అపప్రయోగంగా లేదా పొరబాటుగా వాడటం జరుగుతోంది, నిజానికి ఈ పరీక్షలో హార్మోన్ను గుర్తించడం జరుగుతుంది కానీ గర్భస్థ పిండాన్ని కాదు. ఈ హార్మోన్ గర్భాశయ అంతర్గత గోడలకు ముందటి పిండము జతపడిన వెంటనే మాయ (దీన్నే గర్భస్థ మావి, పోషణావయవము అంటారు) నుండి విడుదల అవుతుంది.
అందువల్ల, ఇది గర్భధారణ యొక్క ఒక ముఖ్యమైన సూచిక. మూత్ర పరీక్షతో పాటు, ఆరోగ్య సంరక్షణాకేంద్రం (హెల్త్కేర్ సెంటర్) పరీక్షలో నిర్వహించే గర్భనిర్ధారణ పరీక్ష రక్తంలో HCG ఉనికిని గుర్తించడం జరుగుతుంది, ఇంకా, గర్భంలో పిండం యొక్క ఉనికిని తనిఖీ చేయడానికి ఆల్ట్రాసౌండ్ ను ఉపయోగించడం జరుగుతుంది.