ఇప్పటికి, మీరు మొదటి త్రైమాసికం దాటారు మరియు మీ రెండవ త్రైమాసికం కూడా దాదాపుగా విజయవంతంగా పూర్తి చేయగలిగారు. గర్భధారణ యొక్క 6 వ నెల రెండవ త్రైమాసికం పూర్తయినట్లు సూచిస్తుంది మరియు మీరు మీ గర్భధారణలో సగం కంటే ఎక్కువ రోజులు పూర్తయ్యాయి. మీరు చాలా వరకు సంతోషంగా ఉండివుంటారు కానీ తర్వాతి రోజులలో శిశువు గురించిన చింత మీ ఆనందాన్ని కొద్దిగా తగ్గించవచ్చు. కానీ ఇది మీరు దిగులు చెందవలసిన సమయం కాదు.

మీరు ఇప్పటికీ శిశువు పేర్లను ఆలోచిస్తూ ఉంటారు. అవునా? మీరు ఏ ఆసుపత్రిలో ప్రసవించాలనుకుంటున్నారో నిర్ణయించుకున్నారా? మీప్రసవం తర్వాత సంరక్షణను ప్లాన్ చేయడం మాత్రమే కాకుండా, మీరు చేయవలసిన పనులను కూడా తెలుసుకోవాలి.

ఈ వ్యాసం పూర్తిగా చదివేసరికి, ఆరవ నెల గర్భంలో మీ శరీరంలో జరిగే అనేక మార్పుల గురించి మీకు తెలుస్తుంది. ఈ సమయానికి మీ బిడ్డ ఎలా ఉంటుందో మరియు మీరు తీసుకోవలసిన ఆహారం మరియు ఏమి వ్యాయామాలు చెయ్యాలో మరియు ఎలా చెయ్యాలో కూడా మీరు తెలుసుకుంటారు.

 1. 6 నెలల గర్భధారణ కోసం ఆహారవిధానం - 6 month pregnancy diet in Telugu
 2. 6 నెలల గర్భవతిలో ఉండే సంకేతాలు మరియు లక్షణాలు - 6 month pregnant: signs and symptoms in Telugu
 3. 6 నెలల గర్భంలో శిశువు - 6 months pregnant baby in Telugu
 4. గర్భధారణ 6 నెలలలో వ్యాయామం - 6 months pregnant exercise in Telugu
 5. గర్భం యొక్క 6వ నెలలో పరీక్షలు మరియు టీకాలు - 6 month pregnancy tests and vaccines in Telugu
 6. 6 నెలల గర్భ సంరక్షణ - 6 month pregnancy care in Telugu

ఇప్పుడు మీ శిశువు కడుపులో వేగంగా పెరుగుతోంది మరియు దాని పోషక అవసరాలను తీర్చడానికి మీరు ఎక్కువ తినవలసి ఉంటుంది. వాస్తవానికి, మీరు ఇప్పటికే ఎక్కువ ఆకలిని  అనుభవిస్తుంటారు మరియు తరచుగా ఏదోకటి తినాలనే కోరికను కలిగి ఉంటారు.

సాధారణంగా, అధిక లావు లేని స్త్రీ రెండవ త్రైమాసికంలో తన రోజువారీ ఆహారంలో 400 కేలరీలను అదనంగా జోడించాల్సి ఉంటుంది. అయితే, మీరు అతిగా తినడం ప్రారంభించి అదనపు బరువు పెరగమని అర్ధం కాదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.

ఒకేసారి పెద్దమొత్తంలో కాకుండా తరచుగా చిన్న చిన్న మొత్తాలుగా తినండి. ఇది మిమ్మల్ని సంతృప్తికరంగా (కడుపు నిండినట్లు) ఉంచడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా  మీ శరీరానికి స్థిరమైన శక్తి లభించేలా చేస్తుంది. మీ మరియు మీ శిశువు ఆరోగ్యానికి ఎటువంటి ఆటంకం కలిగించని మీరు సురక్షితంగా మీ డైట్ లో చేర్చగల ఆహార పదార్దాల జాబితా ఇక్కడ ఇవ్వబడింది.

ఆకుకూరలు మరియు తొక్కలతో సహా పండ్లు: ఇవి మీ ఖనిజ మరియు విటమిన్ అవసరాలను తీర్చడమే కాక మీ ఆహారంలో ఫైబర్ల యొక్క అద్భుతమైన మూలాలుగా పనిచేస్తాయి. పండ్లు మరియు కూరగాయలు పుష్కలంగా తినడం వల్ల మలబద్దకాన్ని తగ్గిస్తాయి, తద్వారా మొలల ప్రమాదం కూడా తగ్గుతుంది.

పాల ఉత్పత్తులు: ఫ్యాటీ ఆసిడ్ల  సహజ వనరుగా మాత్రమే కాకుండా, మీ శరీరానికి రోజువారీ అవసరమైన కాల్షియం మోతాదును అందిచడంలో ఇవి సహాయపడతాయి. మీరు రోజుకు 1 నుండి 3 సార్లు పాల ఉత్పత్తులను ఎంచుకోవచ్చు. అయితే, ఇది మీ శారీరక అవసరాలు మరియు స్థితి మరియు మీ శిశువు అవసరాలను బట్టి మారవచ్చు. కాబట్టి, పాల ఉత్పత్తుల సరైన పరిమాణాన్ని తెలుసుకోవడానికి మీరు పోషకాహార నిపుణుడిని సంప్రదించాలని ఎల్లప్పుడూ సిఫార్సు చేయబడుతుంది.

అయితే, బ్రీ (brie) మరియు కామెమ్బెర్ట్ (camembert) వంటి సాఫ్ట్ చీజ్ లను నివారించడం మంచిది.

ద్రవాలను తీసుకోవడం: మీరు ఆరోగ్యకరమైన ఆహార విధానాన్ని పాటిస్తున్నపుడు దానిలో ద్రవాలను (ఫ్లూయిడ్స్) తీసుకోకపోవడం అనేది ఉండదు. గర్భిణీ స్త్రీకి ప్రతిరోజూ 2-3 లీటర్ల నీరు అవసరం. కాబట్టి, మీరు తగినంత నీటిని తీసుకోవడం అవసరం. మీరు పండ్ల రసాలను కూడా ఎంచుకోవచ్చు, అయితే, ప్రాసెస్ చేసిన రసాలలో ప్రిజర్వేటివ్లు మరియు అదనపు ఫ్లేవర్లు ఉంటాయి అవి మీ లేదా మీ పిల్లల ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు కాబట్టి పండ్ల రసాలను ఇంట్లో తయారు చేసుకుని త్రాగడం మంచిది. అలాగే, వాటిలో అదనపు చక్కెరలు ఉంటాయి. అవి మీకు పోషకాలను అందించకుండా కేలరీల సంఖ్యను అధికంగా పెంచుతాయి.

కాఫీ మరియు టీలను కూడా మానుకోవాలి ఎందుకంటే శిశువు అభివృద్ధికి కెఫిన్ మంచిది కాదు. మద్యం వలన కూడా అదే జరుగుతుంది.

మాంసం, చేపలు మరియు గుడ్లు: వండిన మాంసం, చేపలు మరియు గుడ్లను ఎంచుకోవడం మంచిది మరియు పచ్చి లేదా సరిగ్గా వండని మాంసాలను ఎంచుకోకూడదు, ఎందుకంటే చాలావరకు ఈ ఉత్పత్తులు లిస్టిరియోసిస్ మరియు సాల్మొనెలోసిస్ యొక్క అవకాశాలను పెంచుతాయి. మాంసాలను పూర్తిగా వండటం వల్ల వీటిలోని వ్యాధికారక క్రిములు చచ్చిపోతాయి. అలాగే, అధిక కొవ్వు ఉండే మాంసాల కంటే లీన్ మాంసాలు (లీన్ మీట్) మంచి ఎంపిక మరియు ట్యూనా, ట్రౌట్, సార్డైన్ మరియు సాల్మన్ వంటి ఆయిలీ చేపలను తగ్గించడం మంచిది.

పైన పేర్కొన్న ఆహారాలు మాత్రమే కాకుండా, తృణధాన్యాలు మరియు అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ను మీ ఆహారంలో చేర్చడం మంచిది.

Women Health Supplements
₹719  ₹799  10% OFF
BUY NOW

మీరు ఇప్పటికే అనేక శారీరక మార్పుల ఎదుర్కొన్నారు, అయితే  6 వ నెలలో మీకు తగిన దుస్తుల కోసం షాపింగ్ చేయవలసి ఉంటుంది. ఈ నెలలో మీ బేబీ బంప్ మరింత స్పష్టంగా కనిపిస్తుంది మరియు దాని వలన, వెన్నునొప్పి మరియు ఎడెమా ప్రారంభం కావచ్చు. కానీ 6వ నెల గర్భంలో ఇవి మాత్రమే ఉండవు. ఈ నెలలో మీరు అనుభవించే కొన్ని సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు ఇక్కడ చర్చించబడ్డాయి:

 • అలసట మరియు నీరసం
 • నిద్ర క్రమాలలో మార్పులు
 • ఉబ్బరం, గుండెల్లో మంట మరియు మలబద్ధకం వంటి జీర్ణశయా సమస్యలు
 • తలనొప్పి
 • కాళ్ళు మరియు చేతుల్లో వాపు
 • ముక్కు నుండి రక్తస్రావం
 • చర్మం మీద చారలు
 • మైకము
 • ముఖం మీద ముదురు రంగు మచ్చలు
 • యోని స్రావాలు
 • స్పాట్టింగ్ [రక్తపు చుక్కలు] (స్పష్టమైన రక్తస్రావం గమనించినట్లయితే మీ వైద్యుడిని సంప్రదించండి)
 • మెరిసే మరియు ఒత్తైన జుట్టు
 • రొమ్ముల నుండి ముందస్తు-పాల స్రావం
 • ఆహార కోరికలు
 • ఆకలి పెరిగడం
 • వాసన గ్రహించే శక్తి పెరిగిన భావన
 • మానసిక మార్పులు
 • అధిక రక్త పోటు

కొంతమంది మహిళలు మొలలు మరియు యోని ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో కూడా బాధపడవచ్చు. అటువంటి స్థితిలో, గృహ నివారణ చిట్కాలు పాటించడం లేదా సొంతంగా  వైద్యం చేసుకునే బదులు మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ఈ నెలలో మీ శరీరంలో మాదిరిగానే, మీ బిడ్డలో కూడా అనేక మార్పులు జరుగుతాయి. ఈ నెల చివరి నాటికి, శిశువు మరింత తరచుగా కదలడం ప్రారంభించడమే కాదు, ముందస్తు ప్రసవం విషయంలో శిశువు మనుగడకు అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అయితే, ముందస్తు ప్రసవం వలన అసాధారణతలు మరియు / లేదా వైకల్యాల ప్రమాదం ఉంటుంది.

6 నెలల గర్భంలో శిశువు పరిమాణం మరియు బరువు - 6 months pregnant baby size and weight in Telugu

శిశువు చాలా కొవ్వును నిల్వ చేసుకుంటుంది మరియు 1.5 పౌండ్ల బరువు పెరుగుతుంది, అంటే సుమారు అర కిలో కంటే ఎక్కువ. తల నుండి కాలి వరకు, శిశవు సైజ్ 8-10 అంగుళాలు ఉంటుంది.

ఇంకా చాలా లక్షణాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఈ సమయానికి పిండం పూర్తిగా ఏర్పడిన శిశువులా కనిపిస్తుంది, అయితే చాలా చిన్నదిగా మాత్రమే ఉంటుంది. 6 వ నెలలో మీ బిడ్డలో కలిగే మార్పుల జాబితాను చూద్దాం.

 • మీ శిశువు పెరుగుదల మాయ (ప్లాసెంటా) కంటే పెద్దదిగా ఉంటుంది. అయితే, ఇది (మాయ) ఆహారం, వ్యర్థ పదార్థాలు మరియు శ్వాసకోశ వాయువుల మార్పిడి యొక్క ఏకైక ఆధారంగా  ఉంటుంది.
 • గోర్లు పెరుగుతూ ఉంటాయి మరియు శరీరం పలుచని పిండ జుట్టు పొరను అభివృద్ధి చేస్తుంది, దీనిని సాధారణంగా శిశురోమం (లానుగో) అని పిలుస్తారు. అయినప్పటికీ, ప్రసవ సమయానికి పిండంలో ఈ జుట్టు ఉండదు. ఇవి ప్రధానంగా శిశువును వెచ్చగా ఉంచడానికి ఏర్పడతాయి.
 • మెదడు మరియు వెన్నుపాము కూడా ఉన్నాయి, కానీ అవి ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందవు.
 • చెవులు అభివృద్ధి చెందుతాయి కాబట్టి, శిశవు బయటి నుండి  మీ మాటలు మరియు శబ్దాలను వినగలదు. మీ బిడ్డతో మాట్లాడటం ప్రారంభించడానికి బహుశా ఇది మంచి సమయం.
 • రుచి మొగ్గలు కూడా అభివృద్ధి చెందుతాయి
 • రొమ్ము ఎముక అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది మరియు పుట్టిన తరువాత నిటారుగా ఉండే భంగిమ ఏర్పడడంకోసం వెన్నెముక ఎముకలు ఒక స్థానంలోకి వస్తాయి.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Prajnas Fertility Booster by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors for lakhs of male and female infertility problems with good results.
Fertility Booster
₹899  ₹999  10% OFF
BUY NOW

6 నెలల గర్భంలో శిశువు కదలిక - 6 month pregnancy baby movement in Telugu

మీ బిడ్డ లోపల తన్నడం కూడా మొదలు కావచ్చు మరియు ఈ కిక్‌లు సమయనుసారంగా పెరుగుతూ ఉంటాయి. ఇది మీ శిశువు మెదడు సరిగ్గా అభివృద్ధి చెందుతుంది అనే దానికి సంకేతం. శిశువు కదలికలు ముఖ్యంగా మొదటిసారి తల్లి కాబోతున్న వారిలో, ఈ నెల చివరి వరకు అధికం కావు.  కానీ కొంతమంది మహిళలు ఈ సమయాని కంటే ముందే కొన్ని కదలికలను అనుభవించవచ్చు. మీరు మధ్యమధ్యలో 8 నుండి 10 కదలికలను అనుభవించడం కూడా అసాధారణం కాదు (మీకు అనిపిస్తే కనుక).

ఏదేమైనా, ప్రతి బిడ్డకు భిన్నమైన కదలికలు ఉంటాయి మరియు మీ బిడ్డ కిక్ వేరొకరి కంటే పూర్తిగా భిన్నమైనముగా ఉన్న ఏమి పర్వాలేదు.

మీ శిశువు కదలికల గురించి మీరు చాలా ఆందోళనగా ఉంటే లేదా కదలికల తీరు మారితే లేదా మునుపటి కంటే తగ్గినట్లయితే, మీరు మీ వైద్యులని సంప్రదించవచ్చు. మీ శిశువు యొక్క కదలికను ప్రభావితం చేసే కొన్ని సాధారణ కారకాలు:

 • ఊబకాయం లేదా అధిక బరువు ఉండటం
 • చాలా తక్కువ లేదా ఎక్కువ ఉమ్మనీరు  కలిగి ఉండటం (మీ బిడ్డ చుట్టూ ఉండే ఒక ద్రవం [amniotic fluid])
 • మీరు ఏవైనా నిర్దిష్ట రకాల సూచించిన లేదా సూచించని ఔషధాలను తీసుకుంటుంటే
 • మద్యపానం
 • శిశువు పరిమాణం

ఆరోగ్యకరమైన ఆహారం మీరు సరైన పోషకాలను పొందేలా చేస్తుంది కాని మీ కండరాల చర్యల సంగతి ఏమిటి? మీరు గర్భవతి కాబట్టి మీరు ఒకపక్కన కూర్చుని మీ రోజువారీ వ్యాయామాన్ని విడిచిపెట్టబోతున్నారా? మీరు గర్భవతిగా ఉన్నప్పుడు కఠినమైన/అధికమైన కదలికల/శ్రమల పట్ల జాగ్రత్తగా ఉండాలి, కానీ మీరు ఎలాంటి వ్యాయామం చేయకూడదని చెప్పే పరిశోధనా ఆధారాలు లేవు. వాస్తవానికి, గర్భిణీ స్త్రీలు తమ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి తేలికపాటి వ్యాయామాలను ఎంచుకోవాలని మరియు అధిక రక్తపోటు, మలబద్ధకం మరియు వెన్నునొప్పితో సహా గర్భధారణతో ముడిపడి ఉండే ఇతర బాధలను ఈ వ్యాయామాలు తగ్గించడంలో సహాయపడతాయని సూచించబడింది. ఇంకా, ఇది సిజేరియన్ (శస్త్రచికిత్స) ప్రసవానికి బదులుగా సహజ ప్రసవం యొక్క అవకాశాలను పెంచుతుంది.

సాధారణంగా, మీరు ప్రతిరోజూ 30 నిమిషాల వ్యాయామం చేయడం మంచిది, కానీ మీరు 10-15 నిమిషాలతో ప్రారంభించి క్రమంగా ఈ సమయాన్ని పెంచుకోవచ్చు.

మీ దినచర్యలో నడక మరియు ఈత వంటి వ్యాయామాలను చేర్చవచ్చు. కొత్త రకమైన వ్యాయామాన్ని మొదలుపెట్టే ముందు మీరు మీ వైద్యుడితో ఒకసారి మాట్లాడాలి.

మీ నడుము భాగపు కండరాలను బలోపేతం చేయడానికి కొన్ని కటి భాగ వ్యాయామాలను ప్రారంభించడానికి ఇది ఉత్తమ సమయం. ఈ వ్యాయామాలు కటి కండరాలలో ఒత్తిడిని తగ్గించడంతో పాటు, మీరు నవ్విన లేదా తుమ్ముతున్న ప్రతిసారీ లీక్ అవ్వడాన్ని నివారిస్తాయి.

పాదాల వ్యాయామాలు వాచినటువంటి మీ పాదాల వలన అధికంగా బాధ కలిగించకుండా చూస్తాయి.

మీరు ఒక యోగా బోధకుడిని కూడా నియమించుకోవచ్చు ఒత్తిడి మరియు ఆందోళన నుండి ఉపశమనం పొందటానికి కొన్ని సులభమైన యోగాసనాలు మరియు ధ్యాన విధానాలు అభ్యసించవచ్చు.

మీ నెలవారీ పరీక్షలు కాకుండా, మీరు గర్భధారణ సమయ మధుమేహ తనిఖీ కోసం ఒకసారి పరీక్షించుకోవల్సి ఉంటుంది. ఈ పరీక్ష మీరు గర్భం దాల్చిన 24 నుండి 28 వారాలలోపు చేయవచ్చు, అయితే దాన్ని త్వరగా చేయటం మంచిది. ఈ పరీక్షలో సాధారణంగా గ్లూకోజ్ స్క్రీనింగ్ పరీక్ష మరియు గ్లూకోస్ టాలరెన్స్ పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలు మీ రక్తంలో చక్కెర యొక్క అప్పర్ లిమిట్ మరియు మీ రక్తంలో చక్కెర స్థాయిలలో మార్పులను నిర్ణయిస్తాయి.

అదనంగా, మీ శరీరంలో ఏవైనా అసాధారణతలు వచ్చే అవకాశాలను నివారించడానికి మూత్రం మరియు రక్త నమూనాలను తీసుకోవచ్చు.

టీకాలు (వాక్సినేషన్) 

మీరు ఇంకా ఫ్లూ మరియు కోరింత దగ్గుకు టీకాలు వేయించుకోకపోతే, ఇది వాక్సినేషన్  సమయం. ఈ రెండు సమస్యలు శిశువుకు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. మీరు ఈ వాక్సిన్  షాట్లను పొందినప్పుడు, యాంటీబాడీలు మాయ (ప్లాసెంటా) గుండా శిశువుకు చేరుతాయి, ప్రసవం తర్వాత శిశువును సురక్షితంగా ఉంచుతాయి.

మీ మునుపటి వాక్సినేషన్ యొక్క స్థితిని బట్టి, మీరు హెపటైటిస్ ఎ మరియు బి లకు కూడా టీకాలు వేయించుకోవలసి ఉంటుంది.

Ashokarishta
₹360  ₹400  10% OFF
BUY NOW

మీరు మీ రోజువారీ కార్యకలాపాల పట్ల అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి మరియు మీ గురించి సరైన జాగ్రత్తలు పాటించాలి. అయితే, ఆరవ నెల గర్భంలో మీరు గుర్తుంచుకోవలసిన అనేక విషయాలు ఉన్నాయి. అలాగే, ఇప్పుడు మీరు మీ ప్రసవ తేదీకి దగ్గరగా ఉన్నందున, మీరు మొదలుపెట్టవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ నెలలో కొన్ని చేయవలసిన వాటిని మరియు చేయకూడని వాటిని గురించి తెలుసుకోవాలి.

చేయవలసినవి 

 • సమతుల్య ఆహారాన్ని తీసుకోండి
 • పండ్లు మరియు ఆకుపచ్చ కూరగాయలు పుష్కలంగా తినండి
 • తగినంత నీరు త్రాగాలి
 • క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి 
 • పని హక్కులు (work rights) మరియు ప్రసూతి సెలవులు యొక్క ప్రణాళిక ప్రారంభించండి
 • మీరు ఎలాంటి వైద్య సదుపాయాన్ని పొందాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి
 • మీ ప్రసవానంతర సంరక్షణ కోసం మీకు అవసరమైన విషయాల జాబితాను రూపొందించుకోండి
 • పిల్లల పేర్లను శోధించడం ప్రారంభించండి
 • ధ్యానం చెయ్యండి
 • ఏదైనా అభిరుచి (హాబీ) ని మొదలుపెట్టండి 
 • గర్భధారణ యోగా చెయ్యండి
 • కడుపులో మీ శిశువు కదలికలను గమనించండి
 • మీ గ్లూకోజ్ పరీక్షలను సమయానుసారం చేయించుకోండి 
 • అకాల ప్రసవ సంకేతాల గురించి జాగ్రత్తగా ఉండండి మరియు తరచుగా సంకోచాలు, యోని రక్తస్రావం మరియు కడుపులో పదునైన నొప్పి వచ్చినప్పుడు మీ వైద్యుడిని వెంటనే సంప్రదించండి.

చేయకూడనివి

 • ప్రాసెస్ చేసిన పానీయాలను త్రాగడం
 • జంక్ ఫుడ్ తినడం
 • చల్లని లేదా ప్రాసెస్ చేసిన మాంసాలు మరియు గుడ్లు తినడం
 • కఠినమైన వ్యాయామాలు చేయడం
 • డాక్టర్ అపాయింట్‌మెంట్న మిస్ చెయ్యడం
 • టీకాలు వేయించుకోకపోవడం
 • స్వీయ వైద్యం చేసుకోవడం
 • మద్యం సేవించడం
 • గృహ నివారణా చిట్కాలు పాటించడం
 • ధూమపానం మానుకోండి మరియు వీలైతే, పరోక్ష ధూమపానం హానికరం కాబట్టి ధూమపానం చేసేవారికి కూడా దూరంగా ఉండండి

వనరులు

 1. National Health Service [Internet]. UK; Week 24 – your second trimester.
 2. National Health Service [Internet]. UK; You and your baby at 24 weeks pregnant.
 3. Department of Health, Government of South Australia. Parent Information: for babies born 25 weeks. [Internet]
 4. Office on Women's Health [Internet] U.S. Department of Health and Human Services; Stages of pregnancy.
 5. National Health Service [Internet]. UK; You and your baby at 21 weeks pregnant.
 6. National Health Service [Internet]. UK; You and your baby at 23 weeks pregnant.
 7. South Eastern Sydney Local Health District. Baby’s movements: What is normal? . [Internet]
 8. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; TRACKING YOUR WEIGHT For Women Who Begin Pregnancy at a Normal Weight
 9. Florida Health. Food for a Healthy Mother and Baby. Florida Department of Health [Internet]
 10. National Health Service [Internet]. UK; The Pregnancy Book.
 11. National Health Service [Internet]. UK; Week 21 – your second trimester.
 12. Office on Women's Health [Internet] U.S. Department of Health and Human Services; Prenatal care and tests.
 13. Eunice Kennedy Shriver National Institute of Child Health and Human; National Health Service [Internet]. UK; What tests might I need during pregnancy?
 14. American College of Obstetricians and Gynecologists [Internet] Washington, DC; Vaccinations for Pregnant Women
 15. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Maternal Vaccines: Part of a Healthy Pregnancy
Read on app