చాలా శాతం మీ గర్భధారణను విజయవంతంగా పూర్తి చేశారు. ఇక ఎప్పుడైనా ప్రసవం జరుగవచ్చు. మీతో పాటు మీ కుటుంబ సభ్యులందరు చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉండి ఉంటారు ఇప్పటికే మీరు పేర్ల జాబితా తయారు చేసుకుని ఉండవచ్చు. శిశువుకి తన క్రొత్త ఇల్లు  (మీ గర్భం బయట) ఖచ్చితంగా చాలా నచ్చుతుంది మరియు మీరు తన కోసం కొనిపెట్టిన వస్తువులను ఇష్టపడుతుంది. ఇది సంతోషకరమైన సమయం, కానీ మీకు ఖచ్చితంగా ప్రసవం గురించిన ఆందోళన ఉంటుంది మరియు అనేక ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. బరువు పెరగడం ఇప్పుడు మరింత ఎక్కువ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మరియు మీరు ఈ నెలలో దాదాపు 2 కిలో గ్రాముల బరువు పెరగవచ్చు. కాబట్టి, మీరు ఇప్పటికే 13 కిలోలు పెరిగినట్లయితే, ఎలా నెలకు మొత్తం15 కిలోలకు చేరుకుంటుంది, సాధారణ బిఎంఐ (BMI) ఉన్న మహిళల్లో ఆరోగ్యకరమైన గర్భధారణలో ఇది పూర్తిగా సహజం. కాబట్టి, చింతించకండి బరువు తగ్గిపోతుంది మరియు సాగిన గుర్తులు (స్ట్రెచ్ మర్క్స్) పోతాయి. ప్రసవానికి మీ శరీరాన్ని సిద్ధం చేయడంపై దృష్టి పెట్టండి.

ఈ వ్యాసం గర్భధారణ యొక్క తొమ్మిదవ నెలకు సంబంధించిన మీ సమస్యలన్నింటిని గురించి చర్చిస్తుంది మరియు కొంత ఆహార విధానం, వ్యాయామం మరియు సంరక్షణ చిట్కాలను కూడా అందిస్తుంది.

  1. 9 నెలల గర్భవతి యొక్క సంరక్షణ మరియు లక్షణాలు - 9 months pregnant: care and symptoms in Telugu
  2. 9 నెలల గర్భంలో శిశువు స్థానం మరియు శిశువు బరువు - 9 month pregnancy baby position and baby weight in Telugu
  3. 9వ నెల గర్భంలో ఆహారం - 9 month pregnancy diet in Telugu
  4. తొమ్మిదవ నెలలో వ్యాయామం - 9 month pregnancy exercise in Telugu
  5. 9వ నెల గర్భంలో టీకాలు మరియు పరీక్షలు - 9-month pregnancy vaccination and tests in Telugu
  6. ప్రసూతి సెలవు - Maternity leave in Telugu
  7. తొమ్మిదవ నెలలో ప్రసవం - 9 month pregnancy delivery in Telugu

గర్భం యొక్క తొమ్మిదవ నెలలో, మునుపటి నెలల్లో మీరు అనుభవించిన అన్ని లక్షణాలను మీరు మరింత ఎక్కువగా అనుభవిస్తారు . శిశువు పరిమాణం పెరిగేకొద్దీ, అది కటి మీద ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది, ఇది తరచూ మూత్ర విసర్జన యొక్క భావనను పెంచుతుంది. ఆ పెద్ద కడుపుతో అస్తమాను బాత్రూంకి పరుగెత్తటం ఎంత కష్టం?

కడుపు విషయానికి వస్తే, బొడ్డు దగ్గర నుండి కిందకు నిలువుగా ఏర్పడిన  లినియా నిగ్రా అనే చార చాలా ముదురుతుంది మరియు మీ శిశివు కొవ్వును పెంచుకునే కొద్దీ మీ కడుపు బాగా పెరిగి మీకు మరికొన్ని సాగిన గుర్తులు (స్ట్రెచ్ మర్క్స్) ఏర్పడతారు. కానీ, సరైన జాగ్రత్తతో ఈ లక్షణాలన్నీ ప్రసవం తర్వాత తగ్గిపోతాయి. ప్రస్తుతానికి, మీరు క్రమం తప్పకుండా ఎక్కువ నీరు తాగుతూ మీ చర్మాన్ని హైడ్రేట్ చేసుకోవచ్చు మరియు సమయోచిత లోషన్లు మరియు నూనెలను ఉపయోగించవచ్చు.

మీ కడుపు మాత్రమే కాకుండా, మీ వక్షోజాలు కూడా పెరుగుతూ ఉంటాయి మరియు మరింత సున్నితంగా  మారుతాయి. ప్రసవం తర్వాత అవసరమైన కొలొస్ట్రమ్ (ముర్రు పాలు) ఇప్పటికే ఏర్పడుతుంది. ఇది మీ సున్నితమైన మరియు వాచిన రొమ్ముల నుండి లీక్ అయ్యే కూడా అవకాశం ఉంది.

ఈ దశలో యోని లీక్ లేదా స్రావం కూడా సాధారణం.

ప్రసవ సమయానికి దగ్గరవుతున్న కొద్దీ గర్భాశయంలో శిశువు కొద్దిగా కిందకు జారడం వలన గుండెల్లో మంట, మలబద్ధకం మరియు అజీర్ణం వంటి లక్షణాలు మెరుగుపడతాయి. కానీ, పిండం మునుపటిలా పైకే  ఉంటే, ఈ లక్షణాలు మెరుగుపడవు.

బిడ్డ జన్మించబోతుంది అనే ఆనందంతో పోల్చినప్పుడు ఇవన్నీ చిన్నగానే కనిపిస్తాయి!!

కానీ, మీ శరీరమంతా ఉండే విపరీతమైన నొప్పి మరియు అపారమైన అలసట గురించి ఏమిటి? పెరుగుతున్న బిడ్డ వల్ల కలిగే ఒత్తిడి మీ నడుము, ఉదరం, తొడలు మరియు పిరుదులలో నొప్పిని అనుభవిస్తారు. కడుపులో ఏర్పడే/అనుభవింపబడే సంకోచాల మాదిరిగానే ఇది ఆందోళన కలిగించే విషయం కాదు. ప్రసవ సమయంలో అనుభవించే సంకోచాల మాదిరిగానే, ఇవి కొన్ని సెకన్ల పాటు మాత్రమే ఉంటాయి మరియు మీ శరీరాన్ని ప్రసవం కోసం సిద్ధం చేయడంలో సహాయపడతాయి.

డీహైడ్రేషన్ వలన ఈ సంకోచాలు అధికంగా ఏర్పడతాయి, అందువల్ల ఎక్కువ నీరు త్రాగాలని  సిఫార్సు చేయబడుతుంది. ఇది అలసటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మీరు ఎక్కువ అలసటకు గురికావడానికి కారణం మీరు మోస్తున్న అదనపు బరువు. అలసటకు మరో కారణం గర్భధారణ చివరిలో సాధారణంగా మీరు ఉండే  కలత నిద్ర.

పిండం ఇప్పుడు మరింత పెద్దదిగా ఉండడం వలన మీ ఊపిరితిత్తులపై ఒత్తిడిని కలిగిస్తుంది, అందువలన మీకు ఊపిరి ఆడనట్టు అనిపిస్తుంది.

పెరుగుతున్న గర్భాశయం మీ కడుపుపై ​​కూడా ఒత్తిడి కలిగిస్తుంది మరియు దానిని పైకి నెడుతుంది. దీనిని వలన మీకు కడుపు నిండుగా ఉన్న భావన కలిగుతుంది అందువలన తక్కువగా తింటారు. కడుపు మరియు అన్నవాహికపై ఒత్తిడి కూడా రిఫ్లక్స్ లక్షణాలను కూడా కలిగిస్తుంది. చిన్న చిన్న మోతాదులలో తరచుగా భోజనం చేయడం మరియు తక్కువ పరిమాణంతో క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలను ఎంచుకోవడం వలన కడుపు నిండుగా ఉన్న భావన ఉన్నప్పటికీ పోషక విలువలను తగినంతగా అందించడంలో సహాయపడుతుంది.

గర్భధారణ చివరిలో ఉండే మరొక సాధారణ లక్షణం పాదముల మరియు చీలమండల వాపు. ఎడెమా మరియు రక్త సరఫరాలో మార్పుల కారణంగా ఆ భాగాలలో ద్రవాలు ఎక్కువ నిలిచిపోతాయి. దీన్ని నివారించడానికి, ఎక్కువసేపు నిలబడకుండా ఉండటం మంచిది. మధ్యలలో కూర్చుంటూ ఉండండి. కానీ, దీన్ని నిర్వహించడానికి ఉత్తమ మార్గం మీ కాళ్లను పైకి పెట్టి ఉంచడం. కాళ్ళను నిటారుగా ఉంచాల్సిన అవసరం లేదు, దిండు లేదా ఏదైనా స్టూలు పై కాళ్ళను కొంచెం ఎత్తులో పెట్టండి. ఇది కాళ్లలో నరాల యొక్క వాపును తగ్గిస్తుంది.

మీరు సాధారణంగా నిద్రలో కలతలను అనుభవిస్తున్నట్లైయితే, మీకు సౌకర్యవంతంగా  ఉండే నిద్ర భంగిమను కనుగొనమని సూచించబడుతుంది. కడుపు పెద్దగా ఉంటుంది కాబట్టి, వెల్లకిలా  పడుకోవడం మంచిది. ఈ సమయంలో వెల్లకిలా పడుకోవడం కూడా అసౌకర్యంగానే ఉంటుంది ఎందుకంటే అది నడుము నొప్పిని కలిగిస్తుంది. మీ పొట్ట మీద పడుకోవడం వలన అది మీ శిశువుకు హాని కలిగిస్తుంది. నిద్రిస్తున్నప్పుడు, సౌకర్యం కోసం మీరు దిండును ఉపయోగించుకోవచ్చు. మీరు దీన్ని మీ కాళ్ళ మధ్య లేదా పొట్ట కింద పెట్టుకోవచ్చు. ఏది సౌకర్యవంతంగా ఉంటుందో తెలుసుకోవడానికి  మీరు పలు భంగిమలను ప్రయత్నించవచ్చు. ఇది కాకుండా, వెచ్చని నీటి స్నానం లేదా ఒక కప్పు పాలు త్రాగడం కూడా నిద్రకు సహాయపడతాయి. ఈ చర్యలన్నీ పిరుదులలో నొప్పి లేదా వెన్నునొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

పైన పేర్కొన్న లక్షణాలు సాధారణంగా తొమ్మిదవ నెల గర్భంలో మహిళలు అనుభవిస్తారు మరియు అవి ఆరోగ్య సమస్యలకు సంబంధించినవి కావు. అయితే, లక్షణాలు తీవ్రంగా ఉంటే, వైద్యుడిని సంప్రదించడం మంచిది. తీవ్రంగా వాచిన కాళ్ళు ప్రీక్లాంప్సియాకు సంకేతం. అదేవిధంగా, గర్భధారణ సమయంలో సాధారణమైన తరచూ మూత్రవిసర్జన కొన్నిసార్లు మూత్ర మార్గ సంక్రమణ ప్రమాదాన్ని కలిగి ఉండవచ్చు. సమస్యలు తీవ్రంగా ఉంటే వైద్యుడిని సందర్శించి, రోగ నిర్ధారణ చేయించుకుని మరియు చికిత్స పొందడం మంచిది.

Women Health Supplements
₹719  ₹799  10% OFF
BUY NOW

గర్భం యొక్క తొమ్మిదవ నెలలో మీ శిశువు పూర్తిగా అభివృద్ధి చెండుతుంది మరియు మీ కడుపులో నుండి బయటకు రావడానికి వేచి ఉంటుంది. శిశువు పొడవు సుమారు 20 అంగుళాలు లేదా 51 సెంటీమీటర్లు మరియు బరువు దాదాపు 3.3 కిలోలు ఉంటుంది. మిగిలినవి మీరు పిండానికి అందించిన పోషణ స్థాయిపై ఆధారపడి ఉంటాయి.

మునుపటి నెలల్లో పిండం స్థానంతో పోలిస్తే తొమ్మిదవ నెలలో పిండం గర్భాశయంలో కొద్దిగా కిందకు ఉంటుంది.

33 వ వారం తొమ్మిదవ నెల ప్రారంభాన్ని సూచిస్తుంది, శిశువు యొక్క చర్మం ఇంకా వెర్నిక్స్ (vernix [కడుపులో శిశువు చుటూ ఉండే ఒక పోర]) పొరతో కప్పబడి ఉంటుంది, ఇది మందంగా పెరుగుతుంది. శిశువు పూర్తిగా పెరిగి మరియు ఎక్కువ కొవ్వును కలిగి ఉన్నందున, గర్భాశయంలో కదలడానికి స్థలం తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఎనిమిదవ నెలలో మీరు అనుభవించిన కిక్స్ మరియు కదలికల సంఖ్య తగ్గించవచ్చు. కంగారు పడకండి మీ బిడ్డ బాగానే ఉంది.

36 వ వారంలో, శిశువు అప్పటికే తలను తల్లి కటిలోకి పెడుతుంది మరియు పుట్టడానికి సిద్ధంగా ఉంటుంది. శిశువు ఈ దశలో ప్రసవించినట్లయితే మనుగడకు అద్భుతమైన అవకాశాలను కలిగి ఉంటుంది, అయినప్పటికీ ఇది ముందస్తు జననంగానే పరిగణించబడుతుంది. ఈ సమయంలో ప్రసవమైతే మొదట్లో శ్వాస మరియు ఆహారానికి సహకారం అందించడానికి  కొంత వైద్య సహాయం అవసరం. ఈ సమయంలో జన్మించిన పిల్లలను సాధారణంగా కొంతకాలం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ లో ఉంచుతారు.

గర్భం యొక్క తొమ్మిదవ నెలలో, మీకు కలిగే ప్రసవ నొప్పులకు మీ శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి. కాబట్టి, మీరు మీ కేలరీల సంఖ్యను 2400 కేలరీల వరకు పెంచాలి. తరచుగా అల్పాహారం తీసుకోవడంతో పాటు సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా దీనిని సాధించవచ్చు. మీరు తీసుకునే  ఆహారంలో మీకు మరియు మీ బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలు ఉండాలి .

ప్రసవ సమయంలో సంభవించే రక్త నష్టాన్ని భర్తీ చేయడానికి  గర్భధారణ సమయమంతా పరిమాణం పెంచి తీసుకున్న ఐరన్ను తొమ్మిదవ నెలలో కూడా ఎక్కువగానే  తీసుకోవాలి. ఇంకా, తొమ్మిదవ నెలలో ప్రసవ సమయంలో ఐరన్ తీసుకోవడం అనేది రక్తహీనత ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడుతుంది, రక్తహీనత శిశువు యొక్క తక్కువ జనన బరువు మరియు ముందస్తు ప్రసవంతో ముడి పడి ఉంటుంది. కాబట్టి, మీ ప్రసవం సమస్యలు లేకుండా సాధారణంగా  జరగాలంటే, ఐరన్ చాలా ముఖ్యమైనది. మీరు కొన్ని నట్స్ (గింజలు) నమలడం ద్వారా లేదా తృణధాన్యాలు, పప్పుధాన్యాలు లేదా ఆకుకూరల వినియోగాన్ని పెంచడం ద్వారా ఎక్కువ ఐరన్ ను పొందవచ్చు.

ఫోలిక్ యాసిడ్ సప్లీమెంట్లు సాధారణంగా అవసరం ఉండదు. చిన్న చిన్నగా తరచూ తినడం మరియు ఫైబర్స్ వినియోగాన్ని పెంచడం జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఇది కాకుండా, కొన్ని ఆహారాలు ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా నివారించాలి. అవి వండని లేదా పాక్షికంగా వండిన గుడ్లు, పచ్చి మాంసాలు, సలామి, పెప్పరోని, హాట్ డాగ్స్ వంటి కోల్డ్  ప్రాసెస్ చేసిన మాంసాలు, ట్యూనా మరియు సుషీ వంటి చేపలు, ప్రాసెస్ చేసిన చీజ్ మరియు పచ్చి పాలు. ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం సంక్రమణ నుండి ఫుడ్ పాయిజనింగ్ వరకు తీవ్రమైన ప్రభావాలను కలిగించవచ్చు.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Prajnas Fertility Booster by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors for lakhs of male and female infertility problems with good results.
Fertility Booster
₹892  ₹999  10% OFF
BUY NOW

అవును, మీరు తొమ్మిదవ  నెలలో కూడా వ్యాయామం చేయవచ్చు. నిజానికి, ఇది నొప్పులను (ప్రసవాన్ని) ప్రేరేపించే మంచి మార్గం. నొప్పులు రావడం అనేది మీ శరీర బరువు మరియు పిండం మరియు ఆరోగ్య స్థితి అలాగే మీ వయస్సు వంటి ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.

మహిళలలో నొప్పులను ప్రేరేపించే అత్యంత సాధారణ మార్గం తరచూ నడుస్తూ ఉండడం అని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాగే, ఒక సాధారణ పరిధిలో రోజువారీ కార్యకలాపాలు చేయడం అనేది శిశువుపై ఎటువంటి హానికరమైన ప్రభావాలను కలిగించడు. కాబట్టి, మీరు ఈ నెలలో కూడా శారీరకంగా చురుకుగా ఉండాలి మరియు సాధారణ కార్యకలాపాలు చేయడం ఆపివేయకూడదు.

ఇది కాకుండా, స్త్రీలు నొప్పులు ప్రేరేపించబడడానికి కటిని బలపరిచే వ్యాయామాలు మరియు కటి భాగపు వ్యాయామాలు కూడా చెయ్యవచ్చు. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి కొందరు స్క్వాట్స్ మరియు డిప్స్ కూడా చేస్తారు. ఈ విధానం మరియు వ్యాయామాలకు సంబంధించిన ఉత్తమ సలహాల కోసం ఫిట్‌నెస్ నిపుణుడిని సంప్రదించాలని మీకు సిఫార్సు చేయబడుతుంది.

గర్భధారణ సమయంలో టీకా (వాక్సినేషన్) అనేది ఒక ముఖ్యమైన విషయం, ఇది మిమ్మల్ని మరియు మీ బిడ్డను అంటువ్యాధుల ప్రమాదం నుండి రక్షిస్తుంది. గర్భధారణ ప్రారంభ దశలలో ఇన్ఫ్లుఎంజా లేదా ఫ్లూ కోసం మీరు టీకాలు వేయించుకోవడం అత్యవసరం. తొమ్మిదవ నెల కోరింత దగ్గు యొక్క వ్యాక్సిన్ కు అనువైన సమయం. కోరింత దగ్గు శిశువులలో ఒక తీవ్రమైన సమస్య మరియు వారు ఆసుపత్రిలో చేరడానికి ఒక ప్రధాన కారణం. ఈ టీకా శిశువును కోరింత దగ్గు నుండి రక్షించడమే కాకుండా, న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

శిశువు జన్మించిన తరువాత, ఎంఎంఆర్ (MMR) మరియు చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది.

టీకాలు, సాధారణంగా సురక్షితమైనవప్పటికీ గర్భధారణ సమయంలో కొన్ని సమస్యలు కలిగించవచ్చు. కాబట్టి, ఏవైనా సమస్యాత్మక లక్షణాలు కలిపిస్తే మీరు వెంటనే మీ వైద్యుడికి తెలియజేయాలి.

సాధారణంగా తొమ్మిదవ నెలలో రోగనిర్ధారణ పరీక్షలు సూచించబడవు. అయితే, ప్రసవం ఆలస్యం అవుతున్నా లేదా ఏదైనా సమస్య యొక్క అనుమానం ఉంటే మీ వైద్యులు అల్ట్రాసౌండ్ పరీక్షను ఆదేశించవచ్చు.

ప్రసూతి సెలువుకు ఇదే సమయం. మీ ప్రసూతి సెలవు గురించి ఆనందించండి మరియు  మీ ప్రసవం గురించి ప్లాన్ చేసుకోండి. మీరు ప్రసవించదలచిన చోటును ఈపాటికి నిర్ణయించుకుని ఉంటారు, వైద్యుల ముందస్తు అప్పోయింట్మెంట్ ను నమోదు చేసుకోండి మరియు మీకు కావలసిన వాటిని అన్నింటిని సర్దుకోండి. భారతదేశంలో సవరించిన చట్టం ప్రకారం, కనీసం 6 నెలల గర్భధారణ సెలవు తీసుకోవడానికి మీకు అర్హత ఉంది. కాబట్టి, మాతృత్వం యొక్క ఆనందాలను ఆస్వాదించండి.

Ashokarishta
₹359  ₹400  10% OFF
BUY NOW

గర్భధారణ తొమ్మిదవ నెల తర్వాత డెలివరీ జరుగుతుంది, కాని మహిళలు ఈ నెలలో నొప్పులను ప్రేరేపించే చర్యలను ప్రారంభిస్తారు. ఇప్పటికే చెప్పినట్లుగా, నడక మరియు వ్యాయామం నొప్పులను ప్రేరేపించడానికి మరియు సాధారణ ప్రసవాన్ని సులభతరం చేయడానికి సమర్థవంతమైన చర్యలు. కొంతమంది మహిళలకు, గర్భం యొక్క ఆఖరి దశలలో సెక్స్ సహాయపడుతుంది. లైంగిక చర్య సమయంలో విడుదలయ్యే స్త్రీ (ఫిమేల్) సెక్స్ హార్మోన్ గర్భాశయం సంకోచించడానికి మరియు గర్భాశయ ద్వారానికి విశ్రాంతి అందించడానికి ఉపయోగపడుతుంది, ఇది ప్రసవ ప్రక్రియకు సహాయపడుతుంది. అయితే, మీరు శిశువుపై బరువు లేదా ఒత్తిడిని కలిగించని సురక్షితమైన భంగిమను ఎంచుకోవాలి.

నొప్పులను ప్రేరేపించడంలో ఉపయోగకరంగా ఉన్న మరొక చర్య చనుమొనల ప్రేరణం. ప్రతిరోజూ 1 నుండి 3 గంటల వరకు చనుమొనలకు ప్రేరణ కలిగించడం వలన అవి నొప్పులను కలిగించడంలో సహాయపడుతుందని పరిశోధన ఆధారాలు కూడా ధృవీకరించాయి. స్త్రీ (ఫిమేల్) సెక్స్ హార్మోన్లు విడుదల కావడం దీనికి కారణం, ఇది గర్భాశయ ద్వారం తెరుచుకోవడానికి దారితీస్తుంది.

మీరు ఈ చర్యలను ఒక మాదిరిగా ఉపయోగించవచ్చు, కాని, సూచించితే తప్ప, ఇంటి నివారణా చిట్కాలను అస్సలు ప్రయత్నించకూడదు.

వనరులు

  1. Planned Parenthood Federation of America. What happens in the ninth month of pregnancy?. [Internet]
  2. The University of Texas Southwestern Medical Center. 8 third trimester pains and how to deal with them. [Internet]
  3. Office on Women's Health [Internet] U.S. Department of Health and Human Services; Stages of pregnancy.
  4. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Pregnancy - week by week
  5. M Koushkie Jahromi, B Namavar Jahromi, S Hojjati. Relationship between Daily Physical Activity During Last Month of Pregnancy and Pregnancy Outcome . Iran Red Crescent Med J. 2011 Jan; 13(1): 15–20. PMID: 22946014
  6. InformedHealth.org [Internet]. Cologne, Germany: Institute for Quality and Efficiency in Health Care (IQWiG); 2006-. Pregnancy and birth: When your baby’s due date has passed. 2008 Sep 24 [Updated 2018 Mar 22].
Read on app